సైబర్ స్కాంలో డబ్బులు పోయాయా.. గంటలో ఇలా చేస్తే మీ సొమ్ము సేఫ్!
సైబర్ స్కామర్లు చెలరేగిపోతున్నారు. వారి చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలి. నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయవచ్చు అని పోలీసులు చెబుతున్నారు.
ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా
బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ఫోన్ నెంబర్ ను 'కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్' వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయన్నారు. అలా బాధితుడి నుంచి రూ.2.29 కోట్లు బదిలి చేయించుకున్నారు. మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Cyber Scam: చెప్పింది చేయలేదు.. కానీ రూ.16లక్షలు ఫసక్.. ఎలాగంటే?
సైబర్ స్కాం ఉచ్చులో మరో వృద్ధుడు చిక్కుకున్నాడు. ఢిల్లీలోని ద్వారకా నివాసి అయిన 73 ఏళ్ల రామ్‌వీర్ సింగ్ చౌదరికి 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వమని కాల్ వచ్చింది. కానీ అవేమి తాను చేయకుండానే తన ఖాతా నుంచి ఎవరో రూ.16 లక్షలు డ్రా చేశారని పోలీసులకు తెలిపాడు.
Cyber Fraud: నమ్మించి కొట్టేశారు కదరా.. రూ.8.15 కోట్లు స్వాహా చేసిన కేటుగాల్లు..!
హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఇంజినీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సైబర్ ఉచ్చులో పడ్డారు. షేర్లలో పెట్టుబడుల పేరిట సైబర్ నేరస్థులు ఏకంగా రూ.8.15 కోట్లు కాజేశారు. ఈ కేసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)లో నమోదైంది.
Laos: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి
లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లలో వెట్టిచాకిరీ చేస్తున్న 47 మంది భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ విడిపించింది. ఇలాంటి సైబర్ స్కామ్ సెంటర్లు భారతీయులకు తప్పుడు జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి లావోస్‌కు రప్పించి బలవంతంగా పనులు చేయించుకుంటున్నాయి.
Cyber Scam : ఓటీపీ లేదు... కాల్ లేదు.. బ్యాంకు ఖాతాల నుంచి నగదు చోరి!
మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను ట్రాప్ చేయడానికి, డబ్బును మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఓటీపీ లేదు...కాల్ లేదు, మహిళ రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.5 లక్షలు చోరీ జరిగింది.
Cyber Crime: నిరుద్యోగులకు రూ.35 కోట్లు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. అసలేం జరిగిందంటే..
వర్క్ ఫ్రం హోం పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల నుంచి రూ.35 కోట్లు వసూలు చేయడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాలోని రూ.2 లక్షలు పోగొట్టుకున్న ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు.