Cyber Crime: సంచలన సైబర్ స్కామ్‌.. 3 గంటల్లో రూ.49 కోట్లు స్వాహా

సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు రచిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా లోన్లు ఇచ్చే ఓ యాప్‌కే బురిడి కొట్టించారు. కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లు కాజేశారు.

New Update
Hackers loot 49 crores in 3 hours from Moneyview app, Bengaluru cops arrest two

Hackers loot 49 crores in 3 hours from Moneyview app, Bengaluru cops arrest two

సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు రచిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా లోన్లు ఇచ్చే ఓ యాప్‌కే బురిడి కొట్టించారు. కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లు కాజేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మనీవ్యూ అనే యాప్ నడుస్తోంది. దీన్ని హ్యాకర్లు టార్గెట్‌ చేశారు. చైనా, హాంకాంగ్, దుబాయ్, ఫిలిప్పైన్స్‌, దుబాయ్ నుంచి అంతర్జాతీయ ముఠా ఈ సైబర్‌ దాడికి పాల్పడింది.  

Also Read: పాకిస్థాన్‌ రాజకీయాల్లో ప్రకంపనలు.. షెహబజ్ షరీఫ్ VS అసిం మునీర్

ఈ యాప్‌కు చెందిన API కీ ని వినియోగించి కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లను 653 ఫేక్‌ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) వెల్లడించింది. అయితే దుబాయ్‌లోని భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ దాడికి సూత్రధారని పేర్కొంది. బెళగావిలోని ఇస్మాయిల్ అనే వ్యక్తి నుంచి వర్చవల్ ప్రైవేట్ సర్వర్‌ను కొనుగోలు చేసి.. సైబర్‌ దాడికి పాల్పడ్డట్లు తెలిపింది.  

Also Read: బరితెగించిన యూనస్.. బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు..

అయితే ఈ కేసులో బెంగళూరుకు చెందిన CCB అధికారులు.. ఇస్మాయిల్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండో నిందితుడి పేరుమీదున్న ఫేక్ ఖాతాలకు కూడా డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇతర బ్యాంకు ఖాతాల్లో రూ.10 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అలాగే పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లను సీజ్‌ చేశారు. దుబాయ్‌లో ముగ్గురు, హాంకాంగ్‌లో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. వాళ్లని పట్టుకునేందుకు ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 

Also read: ఏఐ మంత్రికి గర్భం..83 మంది 'పిల్లలకు' జన్మనివ్వబోతోంది..అల్బేనియా ప్రధాని వింత ప్రకటన!

Advertisment
తాజా కథనాలు