/rtv/media/media_files/2025/10/27/scam-2025-10-27-21-20-02.jpg)
Beware of 'India Post Chhath Puja Subsidy' message, govt warns of scam
సైబర్ నేరగాళ్లు సరికొత్త వ్యూహాలతో అమాయకులకు వల వేసి డబ్బులు కాజేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్‌ల పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా భారత పోస్టాఫిస్ చఠ్ పూజ సబ్సిడీ రూ.20 వేలు లేదా లక్కీ డ్రా రివార్డు పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఇదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వచ్చే లింకులపై క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లకు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాల సమాచారాన్ని తెలుసుకుంటారని పేర్కొంది.
Also Read: ఇన్‌స్టాలో ఆర్మీ ఆఫీసర్‌లా బిల్డప్ కొట్టి.. డాక్టర్‌ని రేప్ చేసిన డెలివరీ ఏజెంట్
చఠ్‌పూజ సందర్భంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి సబ్సిడీని గానీ లక్కి డ్రా స్కీమ్‌ను ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌లతో తపాలా శాఖకు గానీ.. ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అంతేకాదు ఈ తప్పుడు ఫేక్ మెసేజ్‌లు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పోలి ఉన్నాయని.. సబ్సిడీలు, బహుమతులు లేదా నగదు గిఫ్ట్ పేరుతో ప్రజలను ఆకర్షించి మోసం చేస్తున్నారని తెలిపింది.
🔴 ऑनलाइन फ्रॉड से सावधान रहें!
— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2025
एक वायरल व्हाट्सएप मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार छठ पूजा के अवसर पर सभी भारतीय यूजर्स को 3 महीने का फ्री मोबाइल रिचार्ज दे रही है।
📢 #PIBFactCheck
➡️ यह दावा #फ़र्ज़ी है।
➡️ भारत सरकार ने ऐसी कोई घोषणा नहीं की है।
➡️ यह संदेश… pic.twitter.com/jF77vxKcyz
Also Read: పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రకంపనలు.. షెహబజ్ షరీఫ్ VS అసిం మునీర్
వ్యక్తిగత బ్యాంక్ naఅకౌండ్ నెంబర్లు, ATM పిన్, ఓటీపీ, ఆధార్ లాంటి సమాచారం ఎవరికీ షేర్ చేయొద్దని సూచనలు చేసింది. ప్రభుత్వ సబ్లిడీలు లేదా గిఫ్టులు ఇస్తామని ఆశపెట్టే లింకులను క్లిక్ చేయొద్దని చెప్పింది. వీటికి సంబంధించిన మెసేజ్‌ల ప్రామణికతను చెక్ చేసేందుకు ఆ మెసేజ్ అయినా లింక్ అయినా లేదా ఫొటోను PIB ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ +91 8799711259కు పంపించవచ్చని తెలిపింది. లేదా ఎక్స్ అకౌంట్ @PIBFactCheck ద్వారా కూడా పంపించవచ్చని చెప్పింది.
Also Read: ఏఐ మంత్రికి గర్భం..83 మంది 'పిల్లలకు' జన్మనివ్వబోతోంది..అల్బేనియా ప్రధాని వింత ప్రకటన!
Follow Us