/rtv/media/media_files/2025/03/17/RNmQO5hCTRkbCif4IAzF.jpg)
Kanpur man outsmarts scammer tricks him into sending Rs 10,000
ఈ వార్త నేటి ప్రజలకు స్ఫూర్తిదాయకం. సైబర్ వలలో పడి ఇప్పటికి ఎంతో మంది తమ డబ్బును కోల్పోయారు. కానీ సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కకుండా ఓ వ్యక్తి ఆడిన వింత నాటకం అత్యద్భుతం. తన డబ్బులు పోగొట్టుకోకుండా.. తిరిగి స్కామర్‌నే బురిడీ కొట్టించి అతడి వద్ద నుంచి డబ్బులు తీసుకునే తీరు అందరి చేత ప్రశంసలు కురిపిస్తుంది. సైబర్ కేటుగాళ్ల నుంచి తీసుకున్న డబ్బును ఆ వ్యక్తి డొనేషన్‌గా ఇవ్వడం మరింతగా ప్రజలను ఆకట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన భూపేంద్రసింగ్‌కు ఒక కాల్ వచ్చింది. అందులో ఒక సైబర్ కేటుగాడు.. తనను తాను సీబీఐ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. భూపేంద్ర సింగ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని అతడిని భయపెట్టాడు. ఈ కేసును క్లోజ్ చేయాలంటే తనకు రూ.16వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ తరహా సైబర్ స్కామర్ల కాల్స్‌పై అవగాహన కలిగి ఉన్న భూపేంద్ర ముందుగానే జాగ్రత్త పడ్డాడు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
రివర్స్ గేమ్ ప్లే
అక్కడ నుంచి తన స్టైల్లో రివర్స్ గేమ్ ప్లే చేశాడు. ఎలాగైనా ఆ స్కామర్ నుంచి డబ్బులు పిండాలని నిర్ణయించుకున్నాడు. ‘‘అయ్యో సార్ సార్ ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పకండి సార్.. చెప్తే నా జీవితం ఖతం అయిపోతుంది సార్. మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను’’ అంటూ బదులిచ్చాడు. అలా చెప్పి తన ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేశాడు.
రూ.3000 కావాలి
తాను గతంలో ఒక బంగారం చైన్ తాకట్టు పెట్టానని.. అయితే అది విడిపించడానికి రూ.3000 కావాలని ఆ స్కామర్‌నే తిరిగి అడిగాడు. ఆ చైన్ విడిపిచి ఎంత కావాలంటే అంత ఇస్తానని నమ్మించాడు. భూపేంద్ర మాటలు నమ్మిన ఆ కేటుగాడు తొలుగు రూ.3వేలు ట్రాన్సఫర్ చేశాడు. అయితే ఈ వ్యవహారం అంతటి ముగిసిపోలేదు. స్కామర్ నుంచి ఎలాగైనా మరింత డబ్బు పిండాలని డిసైడ్ అయ్యాడు.
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
దీంతో మళ్లీ స్కామర్‌కు ఫోన్ చేసి.. తాను మైనర్‌నని గోల్డ్ షాప్ వ్యక్తి చైన్ తాకట్టు నుంచి ఇవ్వడం లేదని మరో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. ఎలాగైనా మీరే నా తండ్రిలా మాట్లాడాలని స్కామర్‌ను మస్కా కొట్టించాడు. అతడు కూడా సరే అన్నాడు. ఈ క్రమంలో భూపేంద్ర తన ఫ్రెండ్‌ను బంగారం షాపు వ్యక్తిలా సెట్ చేసి మాట్లాడించాడు. ఇక స్కామర్ కూడా నగల వ్యాపారి అనుకుని భూపేంద్ర స్నేహితుడితో మాట్లాడాడు.
రూ.1.10 లక్షలు లోన్
అలా మాట్లాడుతూ.. మరో రూ.4,480 ట్రాన్సఫర్ చేయించుకున్నారు. అది కాకుండా ప్రాసెస్ ఫీజ్ కింద మరో రూ.3వేలు ఇస్తే గొలుసుపై రూ.1.10 లక్షలు లోన్ ఇస్తామని నగల వ్యాపారిలా మాట్లాడుతున్న భూపేంద్ర స్నేహితుడు స్కామర్‌కు చెప్పాడు. ఇలా మొత్తంగా స్కామర్ నుంచి రూ.10 వేల వరకు ట్రాన్సఫర్ చేయించుకున్నారు. చివరికి స్కామర్ గ్రహించి తాను మోసపోయానని గుర్తించాడు.
Also Read : విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
అప్పటి వరకు భూపేంద్రను డబ్బు కోసం డిమాండ్ చేసిన కేటుగాడు.. ఆ తర్వాత తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టాడు. ఇక భూపేంద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. స్కామర్ నుంచి తీసుకున్న రూ. 10వేలను డొనేషన్ కింద ఇస్తానని తెలిపాడు. అతడి సమయస్ఫూర్తికి పోలీసులు ప్రశంసించారు. ప్రజలు ఇలాంటి ఆలోచనలను కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది.