Telangana: జర్నలిస్టులకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం-పొన్నం ప్రభాకర్
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉందన్నారు.