Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం.. ఆ తర్వాత మల్లారెడ్డిపై ఆక్రమణల ఆరోపణలు, కూల్చివేతల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.

New Update
Mallareddy Meets CM Revanth reddy

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఈ రోజు కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలని సీఎంను ఆహ్వానించారు మల్లారెడ్డి. ఈ రోజు తన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీఎంతో భేటీ అయ్యారు మల్లారెడ్డి. సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కలిసిన సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం అక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మల్లారెడ్డి ఈ రోజు తొలిసారి భేటీ అయ్యారు. గతంలోనూ ఆయన సీఎంను కలిసే ప్రయత్నం చేయగా.. అపాయిట్మెంట్ దొరకలేదు. దీంతో ఈ భేటీ తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

ప్రముఖులకు ఆహ్వానం...

గత కొన్ని రోజుల నుంచి వివిధ పార్టీల్లోని ప్రముఖులను కలిసి తన మనవరాలి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు మల్లారెడ్డి. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును సైతం కలిశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ తదితరులను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ రోజు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను సైతం కలిసి తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. 

Also Read :  హైదరాబాద్‌లో సంచలనం.. భార్యని ఏసీబీకి పట్టించిన మాజీ భర్త

Advertisment
తాజా కథనాలు