మరో వివాదంలో కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చ! కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ వార్‌లో భాగంగా ఆమె గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. సీఐ కుర్చీలో కూర్చుని తన అనుచరులను విడిచిపెట్టాలంటూ హల్ చల్ చేశారు. By srinivas 13 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Konda Surekha: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన అనుచరులను అరెస్ట్ చేసినందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. ఏకంగా సీఐ కుర్చీలో కూర్చుని అరెస్ట్ చేసినవారిని విడిచిపెట్టాలంటూ హల్‌చల్ చేశారు. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి కొండ సురేఖ రాకతో గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తతసీఐ కుర్చీలో కూర్చున్న మంత్రి కొండా సురేఖపోలీస్ స్టేషన్కి భారీగా చేరుకున్న కొండ సురేఖ వర్గీయులు.. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని ఆరాతీస్తున్న మంత్రి సురేఖ.మంత్రి కొండా సురేఖ, రేవూరి ప్రకాష్… pic.twitter.com/f8l4ak7MEz — RTV (@RTVnewsnetwork) October 13, 2024 దసరా ఉత్సవాల్లో ఫ్లెక్సీ వార్.. ఈ మేరకు దసరా ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫొటో లేకపోవడంతో వివాదం మొదలైంది. రేవూరి, కొండా వర్గీయుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ధర్మారం రైల్వేగేట్ దగ్గర ధర్నా.. ఈ నేపథ్యంలోనే ధర్మారం రైల్వేగేట్ దగ్గర మంత్రి కొండా సురేఖ వర్గీయుల ధర్నా చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా గీసుకొండలో పరిస్థితులు అదుపు తప్పాయి. కొండా సురేఖ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై రేవూరి ప్రకాష్ రెడ్డి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే తన అనుచరులను అరెస్ట్ చేయడంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చి హంగామా చేశారు. #congress #konda-surekha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి