ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా ఒమార్ అబ్దుల్లా.. సీఎంగా ప్రమాణస్వీకారం ఎప్పుడంటే

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా పార్టీ ఉపాధ్యాక్షుడు ఒమార్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.అక్టోబర్ 11న లేదా 12న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
omar abdullah

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా పార్టీ ఉపాధ్యాక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో కేవలం ఎన్సీ పార్టీనే ఏకంగా 42 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలతోనే సరిపెట్టుకుంది. తాజాగా నలుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు కూడా ఎన్సీకి మద్దతు తెలిపారు. దీంతో ఎన్సీ బలం 46కు చేరి మెజార్డీ మార్క్‌ను దాటింది. మరోవైపు బీజేపీ 29 స్థానాల్లో గెలవగా.. ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు ఈ కమలం పార్టీకి మద్దతు తెలిపారు.

Also Read: 56 ఏళ్ళ తేడా..కానీ రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్..అసలెవరీ శాంతను?

ఇదిలాఉండగా.. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా దాదాపుగా ఖరారైపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ తొలి క్యాబినెట్ తీర్మానం చేస్తామని ఆయన పేర్కొన్నారు.  అయితే ఒమర్ అబ్దుల్లా సీఎంగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. త్వరలోనే ఎన్సీ-కాంగ్రెస్ నేతలు దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. అయితే అక్టోబర్ 11న లేదా 12న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు