పేదల జోలికి రావొద్దు.. కాంగ్రెస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ
పాతబస్తీలోని కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మొదటిసారి స్పందించారు. నిజమాబాద్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. పెదల జోలికి రావద్దని కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చారు. FTL పరిధిలో ఉన్న సచివాలయంతో లేని ఇబ్బంది పేదల ఇళ్లకి ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vinesh Phogat: కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా
వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పోటీలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Uppal : మేడ్చల్ పీర్జాదిగూడలో టెన్షన్..టెన్షన్
మేడ్చల్ పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో భారీగా వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్
ఏపీ మాజీ సీఎం జగన్‌ను తాను కలవలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.కొందరు దుర్మార్గులు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని..అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.
Congress : స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎంపీలకు విప్ జారీ!
మరికొన్ని గంటల్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎంపీలంతా రేపు ఉదయం 11 గంటలకు సభకు హాజరుకావాలని విప్ లో పేర్కొంది. ఈ మేరకు పార్టీ చీఫ్ విప్ సురేష్ ఎంపీలకు విప్ జారీ చేశారు.
Alleti Maheshwar Reddy: వంద కోట్లు ఢిల్లీకి పంపారు.. మంత్రి ఉత్తమ్‌పై ఏలేటి సంచలన ఆరోపణలు
TG: మంత్రి ఉత్తమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కొత్తగా U ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఉత్తమ్ ఢిల్లీకి 100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి.
Prime Minister Modi : హిందువుల విశ్వాసాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. మోదీ సంచలన వ్యాఖ్యలు
భారతదేశంలో హిందువుల విశ్వాసాన్ని తొలగించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ. బీజేపీ కేవలం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.
Congress Party : కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యే సస్పెండ్
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల నేపథ్యంలో షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్, రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందు సింగ్ షెకావత్‌లను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది.