MP: ఆఫ్రికా నుంచి మరో 8 చీతాలు భారత్ కు..
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటికి నీళ్లు అందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఉన్నతాధికాలు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు.
రాజమండ్రిలో 25 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఇంకా చిక్కలేదు. రెండ్రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, వర్షం వల్ల చిరుత పాదముద్రలు కనిపించడం లేదని DFO ప్రసాదరావు వెల్లడించారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
AP: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులను అలర్ట్ చేశారు అధికారులు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ పెడుతోంది. నిన్న పచ్చర్లల్లో మహిళా మాజీ సర్పంచ్‌ను చంపేసిన చిరుత ఇవాళ మహనంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తోంది. రోడ్డుపై తిరుగుతూ కనిపించిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. భక్తులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి. దీంతో వాటిని చూసిన భక్తులు భయంతో హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి.