/rtv/media/media_files/2025/09/13/pig-vs-cheetah-2025-09-13-08-44-35.jpg)
pig vs Cheetah
pig vs Cheetah : సాధారణంగా అడవిలో పులులు, సింహాలు ఇరత క్రూరమృగాలు తమ కంటే చిన్న జంతువులను టార్గెట్ చేస్తాయి. ముఖ్యంగా దున్నలు, జింకలు, పందుల తదితర జంతువులను వేటాడి తింటాయి.ముఖ్యంగా అడవి పందులు ఎక్కువగా పులులకు ఆహారమవుతుంటాయి. ఇక పంది పిల్లలైతే లెక్కేలేదు. అడవి పంది పిల్లలు పులులకు ఈజీగా చిక్కుతాయి. దీంతో అవి వాటికి ఆహారమై పోతాయి. కానీ, అప్పుడప్పుడు ఆ చిన్న జంతువులే పులులకు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆకర్శిస్తోంది. ఆ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం ఆ వీడియోలో ఓ అడవి పంది పిల్ల గొప్ప సాహసం చేసింది. తనను టార్గెట్ చేసిన చిరుత పులులను ఆ పందిపిల్ల రివర్స్ టార్గెట్ చేసింది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు చిరుత పులులను తరిమి కొట్టింది అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Also Read: Caste Income: గుడ్‌న్యూస్.. ఇక నుంచి క్యాస్ట్ ఇన్‌కమ్ సులభంగా పొందచ్చు
latestkruger అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో ప్రకారం.. అడవిలో మూడు చిరుతలు ఓ అడవి పంది పిల్లను టార్గెట్ చేసి దాన్ని వేటాడేందుకు రౌండప్ చేశాయి. అయితే ఆ పంది పిల్ల ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఎదురు తిరిగింది. చిరుతలను వెంటాడింది. వాటి మీదకు రంకె వేయడంతో ఆ మూడు చిరుతలు పారిపోయాయి. మూడు చిరుతలను తరిమి తరిమి కొట్టింది. చిరుత పులులు సైతం ఏం చేయలేక పారిపోయాయి. దీంతో ఈ వీడియో చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. చిరుత పులులను ఎదిరి పోరాడలేని అడవి పందులు క్రూరమృగాలను ఎదురించి నిలబడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.
Also Read: Anushka Shetty: కొంతకాలం కనిపించను.. అనుష్క షాకింగ్ నిర్ణయం! వైరలవుతున్న లెటర్
కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మందికి పైగా వీక్షించారు. 22 వేల మందికి పైగా ఈ వీడియో తమ కామెంట్స్‌ను జతజేశారు. దీంతో చిరుతలకు ఎంత అవమానం జరిగింది అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణకు మించినది ఏముంటుందని మరొకరు కామెంట్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో పందిపిల్ల హీరో అయిపోయింది.
Also Read: Faria Abdullah: దేవకన్యలా ముస్తాబైన ఫరియా.. ఫొటోలు చూస్తే.. వావ్ అనాల్సిందే!