/rtv/media/media_files/2025/04/06/akXdv97m0QWcy1i0gnbx.jpg)
Madhya Pradesh villager offers water to cheetah
వేసవి కాలం రావడం వల్ల మూగజీవాలకు నీళ్లు దొరకగా అవస్థలు పడుతున్నాయి. సాధారణంగా కొంతమంది జంతు ప్రేమికులు మూగజీవుల కోసం ఆహారం, నీటి వసతులను ఏర్పాటు చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అందులో ఉన్న చీతాలకు నీళ్లు అందించినందుకు ఓ డ్రైవర్ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. ఈ క్రమంలోనే అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటిని గమనించి ఓ క్యాన్‌లో నీళ్లు తీసుకొచ్చాడు. ఓ పాత్రలో ఈ నీటిని పోసీ చీతాలకు తాగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆయన చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఆ డ్రైవర్‌పై మండిపడ్డారు. ఏకంగా అతడిని ఉద్యోగంలో నుంచే సస్పెండ్ చేశాడు.
Offering water or milk to #cheetahs by villagers is not a good sign for #wildlife conservation. This may lead to dangerous consequences. As usual, the forest is undisturbed.@CMMadhyaPradesh @ntca_india @PMOIndia @KunoNationalPrk @Collectorsheop1 pic.twitter.com/3iIIYbd8Kn
— ajay dubey (@Ajaydubey9) April 5, 2025
దీనిపై అటవీశాఖ అధికారి ఓ ప్రకటన చేశారు. '' చీతాలకు నీళ్లు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు ఎవరికీ హాని కలిగించేవి కావని వాళ్లు తెలుసుకుంటున్నారు. ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని కూడా వాళ్లందరూ గ్రహించారు. వాటితో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని'' అటవీశాఖ అధికారి అన్నారు.
Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం
మరోవైపు ఇటీవల చీతాను దాని పిల్లలు ఓ జంతువు వెంట పడుతూ గ్రామంలోకి వచ్చాయి. దీంతో వాటిని పొలంలో చూసిన కొందరు స్థానికులు భయపడ్డారు. ఆ తర్వాత చీతాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. తాజాగా వాటిని నీరు అందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
rtv-news | national-news | kuno-national-park