విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses ablaze|
విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses burnt in fire broke out today and sources say that the investigation for the cause of such is on | RTV
విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses burnt in fire broke out today and sources say that the investigation for the cause of such is on | RTV
హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మర్రిపాడ బైపాస్ దగ్గర వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో బారికేడ్లను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపుగా 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కడప జిల్లా జంగంపల్లె వద్ద ప్రగతి జూనియర్ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన డ్రైవర్, విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలకుంట దగ్గర బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెంగళూరులో సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్ పై వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, నాలుగు బైక్స్ ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు బస్సులోని కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ అయ్యాయి.,
ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది.
గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
TG: హన్మకొండ-కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు చిన్నారులు గాయాలు అయ్యాయి.
ఔటర్ రింగ్ రోడ్డుపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయాల పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి.. బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.