Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్‌ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
BUSS2

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్‌ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది చనిపోయినట్లు ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.   

Also Read: ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు.. కలెక్షన్స్ లో చరిత్ర సృష్టించిన 'పుష్ప2'

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు జలవనరులు శాఖ మంత్రి స్వతంత్ర దేవ్‌సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.

Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

ఇదిలాఉండగా.. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరి గేటు వద్ద ఓ లారీ అదుపుతప్పి కూరగాయలు విక్రయించే వ్యాపారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది వ్యాపారులు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.   

Also Read: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!

Also Read:  విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్

Advertisment
తాజా కథనాలు