Sabarimala Bus Accident: శబరిలో ఘోర ప్రమాదం జరిగింది. అయ్యప్పస్వాముల బస్సు శబరికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘాట్ రోడ్డులో టర్న్ చేస్తుండగా హైదరాబాద్‌కు చెందిన బస్సు కంట్రోల్ తప్పింది. దీంతో పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలయ్యాయి. రాజు మృతదేహాన్ని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. పంపానది వద్ద ప్రమాదం: స్థానిక వివరాల ప్రకారం..హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన అయ్యప్ప స్వాములు రెండు రోజుల క్రితం శబరిమల యాత్రకు బస్సు బయల్దేంది. గురువారం రాత్రి ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొని.. బస్సు చెట్లపై పడింది. దీంతో పెనుప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి.ఇది కూడా చదవండి: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. గాయ పడిన స్వాములను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం బస్సును క్రైన్ సహాయంతో పక్కకు తీశారు. అయితే మద్దన్నపేట నుంచి 22 మంది గ్రూపు సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది ప్రైవేట్ ట్రావెల్ బస్సు మాట్లాడుకుని బయల్దేరారు. ఆలయానికి 15 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రకి చేరుకున్నారు.. దగ్గరిదాకా వెళ్లారు..అనుకునేలోపే పంపానది వద్ద ఈ దారుణం జరగటంతో అందరూ భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని దర్శనం కోసం వెళ్తే ఇలా ప్రమాదం జరగటం పైన కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రాణాలతో స్వాములు బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదంతో శబరిమలలోని స్వాములు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అధిక రక్తపోటు ఉంటే ఇవి అమృతం..అస్సలు మిస్‌కావొద్దు