ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తరచూ ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. మరెంతో మంది తీవ్ర గాయాలతో మృత్యువు అంచుల్లో కొట్టిమిట్టాడుతున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గత వారం రోజుల్లో బస్సు యాక్సిడెంట్లు విపరీతంగా జరిగాయి. ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! 35 మందితో బయల్దేరిన పెళ్లి బస్సు తాజాగా అలాంటిదే మరో బస్సు ప్రమాదం జరిగింది. నవీ ముంబయిలోని రాయ్‌ఘఢ్ మహద్‌లో వివాహానికి వెళ్లేందుకు పుణే నుంచి ఓ ప్రైవేటు బస్సు బయలు దేరింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వేడుక కోసం బస్సు ఎక్కారు. దాదాపు 35 మంది మందితో ఆ పెళ్లి బస్సు బయల్దేరింది. ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ బస్సులో సందడి వాతావరణం నెలకొంది. కానీ అనుకోని ఘటన తీవ్ర విషాదం నింపింది. ఉదయమే బయల్దేరిన ఆ బస్సు 9.30 గంటల సమయంలో మంగావ్ సమీపంలోని తమ్హిని ఘాట్ వద్ద ఓ మలుపు వచ్చింది. అక్కడ స్టీరింగ్ తిప్పే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! 5గురు మృతి దీంతో బస్సు ఓ పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదం జరగగానే సమీప స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంట వెంటనే బస్సులో ఉన్నవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు అదే సమయంలో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.