BREAKING: హరీశ్ రావు, KTR హౌస్ అరెస్ట్

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలని గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

New Update
Screenshot 2025-10-09 075505

హైదరాబాద్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ నేతలని గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్సుల్లో RTC క్రాస్ రోడ్డ దగ్గర ఉన్న బస్ భవన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వారిని ఉదయం అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కీలక నాయకులను దిగ్బంధనం చేశారు.

పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ చలో బస్‌భవన్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నిరసనల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. మెహిదీపట్నం నుంచి హరీశ్‌రావు బస్ భవన్‌కు చేరుకున్నారు. నందినగర్‌ నుంచి ఆర్టీసీ బస్సులో కేటీఆర్‌ ప్రయాణించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి బస్ భవన్‌కు బస్సులో ట్రావెల్ చేశారు. ఆర్టీసీ బస్ భవన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నారు. పోలీసులు వారందరని చెదరగొచ్చారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. 

Advertisment
తాజా కథనాలు