/rtv/media/media_files/2025/11/07/brs-party-2025-11-07-10-32-01.jpg)
హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు జరగడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.మోతీనగర్ లోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కూకట్ పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు రావడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో ఇంట్లోకి ఎలా వస్తారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ కీలక నేతల ఇంటిపై సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow Us