/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
మరోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. ముందు నుంచే నితీష్ కుమార్ సీఎం కాబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ, జేడీయూ ఇతర ఎన్డీయే కూటమి అభ్యర్ధులు 243 స్థానాలకు గాను 202 సీట్లను గెలిచి విజయం సొంతం చేసుకున్నారు. బిజేపీ బిహార్‌లో అత్యధికంగా 89 సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు జేడీయూ 85 సీట్లను కైవసం చేసుకుంది.
ఇది కూడా చూడండి: తేజస్వీ యాదవ్‌కు మూడోసారీ దక్కని CM కుర్చి.. బిహార్‌లో మహాఘట్‌బంధన్‌కి బిగ్ షాక్!
Nitish Kumar set to take oath as Chief Minister on November 20, 2025. The ceremony will take place at the historic Gandhi Maidan in Patna.#Bihar#NitishKumarpic.twitter.com/hJoBa956CJ
— The Tatva (@thetatvaindia) November 17, 2025
డిప్యూటీ సీఎంగా అతను?
చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి 19 సీట్లు గెలిచింది. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్తాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహా పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ అతిఎక్కువ సీట్లు సాధించడంతో సీఎంగా నితీష్ కుమార్‌ను ఫిక్స్ చేశారు. అయితే నితీష్ కుమార్ 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత రెండు దశబ్దాల నుంచి నితీష్ కుమార్ బిహార్ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఈసారి చిరాగ్ పాశ్వాన్ లేదా నితీష్ కుమార్‌కు సీఎం కుర్చీ అందే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పుడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చిరాగ్ పాశ్వాన్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ఇండియాలో ఎక్కువకాలం ముఖ్యమంత్రులుగా పని చేసింది వీరే!
Follow Us