BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్‌లోనే!

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Road Accident chithoor

Road Accident

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్ జరిగితే కనురెప్ప పాటులోనే ఘోరం జరిగిపోతుంది. తాజాగా విజయనగరంలోనూ ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్

బైక్‌ను లారీ ఢీ కొనడంతో..

కొమరాడ తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఒక లారీ బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు గిరిజన విద్యార్థులు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతి చెందిన వారు కొమరాడ మండలం కొరిసిల గ్రామానికి చెందిన కార్తీక్, ఉదయ్, జగన్‌గా పోలీసులు గుర్తించారు.  వీరిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబం మొత్తం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

ఒకే కుటుంబంలో ఇద్దరు..

వీరు ముగ్గురు పనుల మీద కొమరాడ వైపు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. లారీ చాలా వేగంగా వచ్చి బైక్‌ను బలంగా ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్ట్‌ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాగడం లేదా అతి వేగం వల్ల ఢీకొట్టారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతివేగం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పొలీసులు అనుమానిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: AP Crime: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 15 మందికి..

ఏపీలోనే మరో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ చేయాలి. సమయం అయిపోతుందని, తొందరగా వెళ్లిపోవాలని కొందరు అతివేగంతో ప్రయాణిస్తారు. ఈ క్రమంలోనే దేశంలో రోజురోజుకీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు అతివేగంతో వెళ్తున్నారు. మరికొందరు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. మత్తులో అతివేగంతో వెళ్లి ఇతరులను యాక్సిడెంట్ చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని అన్నమయ్యలోనూ ఇలాంటి ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ములకలచెరువు మండలం, పెద్దపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్(26), తరుణ్(24), మనోజ్(19) అనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మోటార్‌ బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఒకరు ఇంజనీరింగ్, మరొకరు డిగ్రీ, ఇంకొకరు ఐటీఐ పూర్తి చేసిన వారు ఉన్నారు. చిన్నాన్న, పెద్దనాన్న కుటుంబానికి చెందిన వారు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వెంటనే మృతదేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు