రాజేంద్రనగర్లో భారీ ప్రమాదం.. బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురు పరిస్థితి విషమం..
హైదరాబాద్ శివారులో రాజేంద్రనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. బేకరీలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.