హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకి సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. సుమారుగా రెండు గంటల పాటు మంటలు చెలరేగడంతో 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. అయితే ఈ ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్
మరో చోట అగ్ని ప్రమాదం..
ఇదిలా ఉండగా.. ఏపీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలో విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. ఘటపై అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!
పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ కంపెనీలో సోమవారం ఉదయం తెల్లవారుజామున రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విష వాయువులు లీకు అయ్యాయి. దీంతో ఫార్మా కంపెనీలో పని చేస్తున్న నలుగురు కార్మికులు విష వాయువు వల్ల అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై వెంటనే స్పందిచిన కార్మికులు ఫైర్ సిబ్బందికి, యాజమాన్యంకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగలోకి దిగిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు.
ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!