Pager Explosion : పేలిన పేజర్లు..పదుల సంఖ్యలో మృతులు!

లెబనాన్‌, సిరియాలలో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో లెబనాన్‌ లోని ఇరాన్‌ రాయబారితో పాటు హెజ్‌బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు.

author-image
By Bhavana
New Update
pager

Pager Explosion : లెబనాన్‌, సిరియాల పై మంగళవారం అనూహ్య దాడి జరిగింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. 

ఒక్క సిరియాలోనే ఏడుగురు మరణించారు. గాయపడిన వారిలో లెబనాన్‌ లోని ఇరాన్‌ రాయబారితో పాటు హెజ్‌బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు. పేజర్లు పేలిన ఘటనలో ఇద్దరు హెజ్‌బొల్లా సభ్యులు మరణించారు. ఒక ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇరాన్‌ రాయబారి భద్రతా సిబ్బంది ద్గర ఉన్న పేజర్‌ పేలింది. ముందు పేజర్లు వేడెక్కాయి. ఆ తర్వాత పేలిపోయాయి. ఈ ఘటనలో హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రుల్లాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన క్షేమంగా ఉన్నారని సంస్థ ప్రకటించింది.

Also Read: Andhra Pradesh: గ్రౌండ్‌ఫ్లోర్‌‌లో ఉన్న ప్రతీ ఇంటికి 25వేల రూ.–సీఎం చంద్రబాబు

Advertisment
తాజా కథనాలు