జూబ్లిహిల్స్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ధ్వంసమైన ఇళ్లు

హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్‌ రోడ్ నంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెట్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. రెస్టారెంట్‌ కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇళ్లు ధ్వంసం కాగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

New Update

హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1లో ఉన్న  తెలంగాణ స్పైసీ కిచెన్‌లో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. రెస్టారెంట్‌లో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన జరిగింది. దీంతో హోటల్ ప్రహరీ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అక్కడికి వంద మీటర్లలో ఉన్న నాలుగు గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఇది కూడా చూడండి:  రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఓ మహిళలకు తీవ్రంగా గాయాలు..

ఆ బస్తీలో నివాసం ఉంటున్న ఓ మహిళలకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. రోడ్డు మీద రాళ్లు ఎగిరి పడటంతో పాటు కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

ఉదయాన్నే ఈ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందళోనకు గురయ్యారు. మొత్తం పొగలతో అలముకుంది. అసలు పొగలు, పేలుడు ఎలా సంభవించిందని స్థానికులు ఆందోళన చెందారు. అయితే గ్యాస్ పేలిందని కొందరు స్థానికులు భావిస్తున్నారు. ఇంత పెద్ద శబ్ధంతో పేలుడు కావడంతో గ్యాస్ పేలిందని స్థానికులు భావిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

ఈ భారీ పేలుడు వల్ల బస్తీలో ఉన్న రాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా అయ్యాయి. అలాగే బస్తీలో ఉంటున్న వారి సామానులు కూడా రోడ్డుపై పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక మహిళకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు