/rtv/media/media_files/2025/07/30/scooty-viral-in-odisha-2025-07-30-08-24-06.jpg)
ఇటీవల కాలంలో బైక్‌పై విన్యాసాలు చేస్తూ రీల్స్ క్రియేట్ చేస్తున్నారు ఆకతాయిలు. అలాంటి వారికి పోలీసులు ఎంత చెప్పినా బుద్ది రావడంలేదు. కొంతమందికి ప్రమాదాలై ప్రాణాలు కోల్పోయినా మారడం లేదు. తాజాగా అలాంటి రోడ్ స్టంట్ సోషల్ మీడియాలో మరోటి వైరల్ అవుతోంది. వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకొని బైక్‌ని ప్రమాదకరంగా నడిపన వారిపై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..
అది బైక్ అనుకున్నారో లేక బస్ అనుకున్నారో.. రోడ్డుపై ప్రమాదకంగా ప్రయాణిస్తున్న యువత స్టంట్స్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒడిశా సంబల్పూర్‌లో ఆదివారం రాత్రి ధనుపాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని వీధుల్లో ఏడుగురు యువకులు ఒకే స్కూటీపై ప్రయాణించడం కనిపించింది. సర్కస్ స్టంట్ లాంటి ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదకరమైనది. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం కూడా. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డున్నారు. అలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
#ଗୋଟିଏ_ସ୍କୁଟିରେ_୭ଜଣ
— Kanak News (@kanak_news) July 29, 2025
ଗୋଟିଏ ସ୍କୁଟିରେ ୭ଜଣ ବସି ଯିବା ପଡ଼ିଲା ମହଙ୍ଗା । ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାପରେ ଆକ୍ସନ ମୋଡ୍କୁ ଆସିଲା ପୁଲିସ୍ ।#Sambalpur#Odisha#KanakNewspic.twitter.com/oL4ezMSyH6
మరో ఆశ్చర్యక్రమైన విషయం ఏంటంటే.. ఏడుగురు అబ్బాయిలలో ఆరుగురు మైనర్లు. హెల్మెట్ లేకుండా.. అది కూడా ఒకే స్కూటీపై ఏడుగురు ప్రయాణించడం పోలీసుల దృష్టికి వెళ్లింది. యువకులు బైక్ స్పీడ్‌గా నడుపుతూ, అరుస్తూ, రోడ్డుపై దురుసుగా ప్రవర్తిస్తూ హల్‌చల్ చేశారు. ఆ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. దీంతో ధనుపల్లి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. సిసిటివి ఫుటేజ్ ఉపయోగించి, అధికారులు స్కూటీని గుర్తించి, రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు స్కూటీ యజమానిపై మోటారు వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రూ.21,500 జరిమానా విధించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది వెళ్లడం, మైనర్లను వాహనం నడపడానికి అనుమతించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ వంటి అభియోగాలు మోపారు. మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటిది మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.