డేంజర్ బెల్ .. భయపెడుతున్న విశాఖ బీచ్ | Vizag Beach Shweta Incident Latest Updates | RTV
ఏపీలోని బీచ్‌లకు ఎంట్రీ ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. జనవరి నుంచి ఇది అమలు కానుంది.
పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో విషాదం జరిగింది. సముద్రంలో ఈతకు దిగిన ఐదుగురు వైద్య విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ముగ్గురు మెడికో మహిళలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
బాలీవుడ్లో నటీమణి దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితం దీపికా తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది.తాజాగా దీపికా తాను బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
నాలుగు రోజులుగా వైజాగ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి అక్కడి సముద్రం వెనక్కి వెళ్ళడమే. ఎప్పుడో 2004లో సునామీ వచ్చినప్పుడు వెనక్కు వెళ్ళిన సముద్రం ఇప్పుడు మళ్ళీ అలానే వెళ్తోంది. దీనికి కారణం జపాన్ భూకంపమా? లేక మళ్ళీ సునామీ వస్తుందా? అంటూ అక్కడి వారు భయపడుతున్నారు.
విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫుట్ పాత్ మీదరకు దూసుకు వెళ్లింది. అక్కడే వున్న పార్కింగ్ బైక్ లపైకి దూసుకు వెళ్లింది. దీంతో 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో వున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయయి.