Explosives Case : వైసీపీకి షాక్..పేలుడు పదార్థాల నిల్వ కేసులో వైసీపీ నేత అరెస్ట్
అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వచేసిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు.