AP Politics: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి సైకిల్ ర్యాలీ
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర14వ రోజు బల్లికూరవ మండలంలో సాగింది. బాపట్ల జిల్లా బల్లికూరవ మండలంలోని గొర్రెపాడు గ్రామం నుంచి మండలంలోని సురేపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది.