BUS accident :  బాపట్ల జిల్లా జాతీయ రహదారి పై ట్రావెల్‌ బస్సు బోల్తా...స్పాట్‌లో 38 మంది ప్రయాణికులు

బాపట్ల జిల్లా,పర్చూరు మండలం మార్టూరు జాతీయ రహదారి NH -16 పై ప్రైవేటు ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. తిరుపతి నుంచి అమలాపురం వెళ్తున్న ట్రావెల్‌ బస్సు రాజువాలెం హైవే రెస్ట్‌ ఏరియాలో అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులున్నారు.

New Update
 Bus Accident

Bus Accident

BUS Accident : బాపట్ల జిల్లా,పర్చూరు మండలం మార్టూరు జాతీయ రహదారి NH -16 పై ప్రైవేటు ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. తిరుపతి నుంచి అమలాపురం వెళ్తున్న ట్రావెల్‌ బస్సు  రాజువాలెం హైవేలోని రెస్ట్‌ ఏరియాలో అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులున్నారు.

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ! 

ప్రయాణీకుల్లో 18 మందికి స్వల్పగాయాలయ్యాయి.ప్రమాద విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహయ చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణీకులకు చికిత్స అందించిన అనంతరం వారిని వారివారి సొంత గ్రామాలకు పంపించారు. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై ప్రమాదం జరగడంతో కొంతసేపు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. దీంతకో రోడ్లపై రద్ధీ పెరిగింది. కాగా బస్సు బోల్తా పడ్డ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు