శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే టీడీబీ(ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు) కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా, ఇడుక్కి జిల్లాల పరిధిలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఇందుకుగానూ ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని.. ఈ కవరేజీని ఉచితంగా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా లేదా స్పాట్ బుకింగ్‌ల ద్వారా తమ సందర్శనను బుక్ చేసుకునే యాత్రికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ బీమా పథకాన్ని అమలు చేయడానికి బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Also Read : సంక్రాంతికి ఏ పని తలపెట్టిన.. అసలు తిరుగే ఉండదు Also Read : జైభీమ్ సీన్ రిపీట్ : దొంగతనం ఆరోపణలతో దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి..! కార్మికుల కోసం టీడీబీ మరో బీమా ఇక శబరిమల (Sabarimala) ఆలయంలో పనిచేసే కార్మికుల కోసం టీడీబీ మరో బీమా పథకాన్ని ప్రారంభించింది. శబరిమలను శుభ్రపరిచే, పంపా నుంచి సన్నిధానం వరకు భక్తులను మోసుకెళ్లే డోలీ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. బీమా కోసం కార్మి్కులు రూ.499ను ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో ఈ బీమా పథకాన్ని అమలు చేస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా పూర్తి వైకల్యం ఏర్పడితే రూ. 10 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 5 లక్షలు పరిహారం అందిస్తుంది. బీమా చేసిన వారి పిల్లలకు ఉచిత వైద్య బీమా, విద్యాపరమైన మద్దతుతో సహా అదనపు ప్రయోజనాలను అందించడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు శబరిమలలో ఈనెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ వరకు అయ్యప్ప భక్తుల (Ayyappa Devotees) క్యూ లైన్లులలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పించనున్నారు. రేపటి నుంచి ఆన్‌లైన్ దర్శనాలు పరిమితి విధించనున్నారు. జనవరి 13వ తేదీన 50 వేల మందికి, 14న 40 వేల మందికి ఆన్‌లైన్ దర్శన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. Also Read : జైభీమ్ సీన్ రిపీట్ : దొంగతనం ఆరోపణలతో దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి..! Also Read : Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!