New Update
కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని తెలిపింది. ఇదిలాఉండగా ఇప్పటివరకు కేరళలో 69 మందికి ఈ వ్యాధి సోకింది. దీని ప్రభావంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా కథనాలు
Follow Us