/rtv/media/media_files/2025/11/01/student-who-took-ayyappa-initiation-not-allowed-to-school-2025-11-01-09-34-11.jpg)
Student who took Ayyappa initiation...not allowed to school
Ayyappa Mala : అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని యాజమాన్యం అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లాడు. అయితే పాఠశాల యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించి వేసింది. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప మాలధారులు, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు.
మాల ధరించిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు. వివాదం పెద్దదికావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన భవానీపురం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఈ విషయంలో ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో అయ్యప్ప దీక్షదారులంతా కలిసి ఈ విషయాన్ని డీఈవో యు.వి.సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడడంతో సమస్య సద్దుమనిగింది. కాగా జరిగిన సంఘటనపై అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పి విద్యార్థిని అనుమతిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో ఇటీవల విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు ఉన్నత పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో వివాదం చోటు చేసుకుంది.
జీఐజీ పాఠశాలకు నోటీసులు
ఇదిలా ఉండగా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్‌నేషనల్ పాఠశాల యాజమాన్యానికి డీఈవో సుబ్బారావు నోటీసులు జారీ చేశారు. అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన ఐదో తరగతి విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించక పోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పాఠశాల యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక జిల్లాలోని ఏదైనా ప్రైవేటు, ఎయిడెడ్, తదితర పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాల ధరించి వస్తే దానికి అభ్యంతరం తెలపకుండా తరగతి గదిలోకి అనుమతించాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాల నిర్వాహకులు అభ్యంతరం తెలిపినా, అనుమతించకపోయినా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్... తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కుట్ర కోణం
Follow Us