Pakistan: గాజాకు సైన్యం పంపాలని ట్రంప్ ఒత్తిడి..సతమతమౌతున్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పాకిస్తాన్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ముస్లిం దేశాలా...అమెరికానా అని తేల్చుకోలేక సతమతమౌతోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా రక్షణ కోసం పాకిస్తాన్ సైన్యాన్ని పంపించమని కోరడమే అని తెలుస్తోంది. 

New Update
asim

పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యధిక అధికారాలను కలిగి ఉన్నారు. అపరిమితమైన రాజ్యాంగ అధికారాలు, ఫీల్డ్ మార్షల్ హోదాతో చక్రం తిప్పుతున్నారు. కానీ దౌత్య పరంగా మాత్రం అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఆయనకు ఇదొక అగ్ని పరీక్ష అనే చెప్పవచ్చును. అమెరికానా? ముస్లిం దేశాలా? దేన్ని ఎన్నుకోవాలి..ఎవరికి ఫేవర్ గ ఉండాలి అని తెలియక సతమతమౌతున్నారు. 

గాజాకు సౌన్యం పంపాలని ఒత్తిడి..

గాజాలో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ తన సైన్యాన్ని పంపాలని ట్రంప్ యోచిస్తుండటమే ఇప్పుడు మునీర్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది. ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఉపసంహరణ చేసుకున్నాక అక్కడ పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టాలి. అయితే వాటిని పర్యవేక్షించేందుకు ట్రంప్ అమెరికా సైన్యాన్ని కా ముస్లిం దేశాల సైన్యాన్న రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇందులో పాకిస్తాన్  సైన్యం కీలక పాత్ర పోషించాలని వైట్ హౌస్ కోరుతోంది. ఈ విషయమై ఆల్రెడీ ఇరుదేశాధినేతల మధ్యనా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రానున్న వారాల్లో మరోసారి ట్రంప్, ఆర్మీ చీఫ్ ాసిఫ్ మునీర్ లు మరోసారి భేటీ కానున్నారని సమాచారం. 

సవాల్ గా మరిన ట్రంప్  ప్రతిపాదన..

అమెరికాతో చర్చలు అయితే చేస్తున్నారు కానీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ట్రంప్ ప్రతిపాదన పెద్ద సవాల్ గా మారింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న తరుణంలో అమెరికా పెట్టుబడులు, భద్రతా సాయం చాలా అవసరం. ఇప్పుడు ట్రంప్ ను కాదంటే మొదటికే మోసం వస్తుంది. కానీ గాజాకు సైన్యాన్ని పంపిస్తే ముస్లిం దేశాల వ్యతిరేకత ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా హమాస్ వంటి సంస్థలను నిరాయుధులను చేయడం. ఇది పాకిస్థాన్‌లోని ఇస్లామిక్ గ్రూపులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది. అదీకాక ఆర్మీ చీఫ్ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ సొంత దేశంలోనే అశాంతి చెలరేగే ప్రమాదం కూడా ఉంది. 

Also Read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలే రాజ్యాంగ సవరణలు చేసి మరీ ఆసిమ్ మునీర్‌కు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఆయనకు 2030 వరకు పదవీకాలం పొడిగించడమే కాకుండా జీవితాంతం 'ఫీల్డ్ మార్షల్' హోదాను, ఎటువంటి క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా జీవితకాల విముక్తిని కల్పించింది. ఇలాంటి టైమ్ లు ఆసిమ్ మునీర్ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఈ విషయంపై ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సౌదీ అరేబియా, తుర్కియే, ఖతార్, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి ముస్లిం దేశాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గాజాకు సైన్యాన్ని పంపే విషయంలో ఆయా దేశాల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నారని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు