APPSC GROUP-2: ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?
ఏపీలోని నిరుద్యోగులకు అలెర్ట్. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు షరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరో 10రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 508గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ మరో 212 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 950పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకు రానున్న 10 రోజుల్లోనే నోటిఫికేన్ జారీ చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.