/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/st-jpg.webp)
APPSC Group-2 mains exams today
APPSC: ఏపీలో నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2. అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.
అర్థరాత్రి వరకు ఆందోళనలు..
రోస్టర్ తప్పులను సరిచేసే వరకు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వెయ్యాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అర్థరాత్రి వరకు రోడ్లపై ధర్నాలకు దిగారు. విశాఖలో అర్ధరాత్రి జాతీయ రహదారిపై విద్యార్థుల ఆందోళన చేశారు. ప్రభుత్వం వద్దని చెప్పిన వినకుండా ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నోటిఫికేషన్‌లో రోస్టర్ పాయింట్ల ప్రస్తావనే లేదని ఏపీపీఎస్సీ చెబుతోంది. గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ కార్యదర్శి నర్సింహమూర్తి సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఈరోజు మ్యాచ్ లో కోహ్లీ, పంత్ ఆడతారా?
గ్రూప్ 2 పరీక్ష ఇప్పటికే ఒకసారి వాయిదా వేశాం. అయితే ఇప్పుడు అర్హత సాధించని వారే పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. వారంతా ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తే భవిష్యత్తులో మరో నోటిఫికేషన్ ద్వారా పరీక్ష రాయాలని చూస్తున్నారు. కోచింగ్ సెంటర్లు సైతం తమ స్వప్రయోజనాల కోసం నిరసనల్లో పాల్గొంటున్నాయి. రోస్టర్ పాయింట్ల ప్రస్తావనే లేదు. హైకోర్టు విచారణ జరిపింది. పరీక్ష ఆపితే అభ్యర్థులకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ ఆధారంగా పరీక్ష నిర్వహించాలని తెలిపింది. 84,921 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Ganja: గంజాయిపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. పంట సాగు కోసం ప్రత్యేక శిక్షణ!