AP Group 2 Exam: గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. Appsc సంచలన ప్రకటన!

ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మరోసారి పోస్టు, జోనల్‌ ప్రిఫరెన్స్‌ తీసుకుంటామని, గ్రూప్ 2 పోస్టులకు మెయిన్స్ పరీక్ష తర్వాత దీనికి అవకాశం ఇస్తామని పేర్కొంది. రిజల్ట్స్ వచ్చిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడతామని వెల్లడించింది.

New Update
appsc advised group 2 candidates provide post and zonal preference

appsc advised group 2 candidates provide post and zonal preference

ఏపీలో గ్రూప్‌ 2 నోటిఫికేషన్ వివాదాల మధ్య కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో కాలం అయింది. కానీ పరీక్ష మాత్రం వాయిదా పడుతూ వస్తుంది. అయితే గ్రూప్ 2కి సంబంధించి గతేడాదిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఇక ఈ నెల అంటే ఫిబ్రవరి 23న మెయిన్స్ నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. కానీ వివాదాలు మాత్రం సర్దుమనగలేదు. 

APPSC కీలక ప్రకటన

ఇప్పటికీ పలువురు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పోస్టు, జోనల్‌ ప్రిఫరెన్స్‌ తీసుకుంటామని తెలిపింది. గ్రూప్ 2 పోస్టులకు మెయిన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత దీనికి అవకాశం ఇస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. రిజల్ట్స్ వచ్చిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడతామని వెల్లడించింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేసేందుకు అవకాశం లేదని అర్థం అవుతోంది. 

group 2 candidates provide post and zonal preference
group 2 candidates provide post and zonal preference 

 

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

పరీక్షకు 92,250 మంది హాజరు

మరోవైపు ఫిబ్రవరి 23న జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్నారు. ఈ పరీక్ష రెండు పూటలు జరగనుంది. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ గ్రూపు -2(Group -2) పరీక్షను నిలివేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించనున్న గ్రూప్-2 ప్రధాన పరీక్ష ప్రక్రియను నిలువరించాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. 

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

ప్రస్తుత వాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్-2 ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు(Ex-military Personnel), క్రీడాకారులు(Sports Persons), దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు(Reservation Points) కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం తీర్పు వెలువరించింది.

#Andhra Pradesh #appsc-group-2 #appsc #latest-telugu-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు