/rtv/media/media_files/2025/02/22/5gukZ4xAyyjld7elSRY9.jpg)
APPSC Group 2
APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్పీ సంచలన ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 23నుంచి ఎగ్జామ్ యథాతథంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకోలేమంటూ ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం ఇచ్చింది.
చంద్రబాబు చెప్పినా వినలేదు..
రోస్టర్ తప్పులను సరిచేసేవరకు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖరాసినా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూలు ప్రకారం రేపు ఉదయం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేదుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుండటంపై సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ తీరుపై మండిపడ్డారు. విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మానవతా దృక్పథంతో స్పందించాలన్నారు. గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోస్టర్ రిజర్వేషన్లు తేల్చేవరకు వాయిదా వేయాలన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో మరింత చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి: BIG BREAKING: సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ!
న్యాయబద్దమైన విన్నపాలు..
ఈ మేరకు రోస్టర్ విధానంలో తప్పులను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ ను వాయిదా వేయాలని కోరింది. ఇందుకు సంబంధించి లేఖ కూడా రాసింది. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా వేయాలని కోరింది. అయితే నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఏపీపీఎస్సీ స్పందించలేదు. లక్ష మంది ఆందోళనను ఏపీపీఎస్సీ పెద్దలు అర్థం చేసుకోకపోవడంతోపాటు ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
ఇవి కూడా చదవండి: Champions Trophy 2025: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్