Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వారికి ఇక నుంచి నెలకు 10 వేలు!
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.
ఏపీ ధర్మవరంలో బీజేపీ, వైసీపీ కర్యకర్తల మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులను పరామర్శించేందుకు వెళ్లగా జనసేన-టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు.
ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయగా కాంతమ్మ, సూరి అనే ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కు తరలించారు.
తిరుమల లడ్డూ వివాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. లడ్డూలో చేప నూనె, జంతువుల మాంసం వంటివి ఉపయోగించడం పాపమన్నారు. ఈ పాపమంతా జగన్‌కే చుట్టుకుంటుందని బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్నం కోసం అత్తమామలు, భర్త వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బుడమేరులో గల్లంతైన వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమయింది. ఇవాళ మధ్యాహ్నం మృతదేహాన్ని NDRF సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర కొట్టుకుపోయిన ఫణికృష్ణ.. పడిన ప్రదేశానికి దగ్గరలోనే మృతదేహం ఉంది. అయితే ఫణికృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మహిళలు అప్పు తీసుకొని.. మళ్లీ అడిగితే కూల్‌డ్రింక్‌లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేసిన లేడీ కిల్లర్స్ ను అరెస్టు చేశారు.
వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్షుద్రపూజల కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని సుబ్రమనేశ్వరస్వామి గుడి సమీపంలోని ఓ బిల్డింగ్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.