కొండెక్కిన కోడి ...కిలో రూ. 270!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి.
కడప జిల్లా చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. నొప్పిగా ఉందని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించడానికి అక్టోబర్ 2వ తేదీన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు.
తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచరిస్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దీపక్ టీటీడీ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలియజేశారు.
పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో 10 శాతం రాయితీతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటూ ప్రకటిస్తూనే యాజమాన్యం ఉద్యోగులపై పెద్ద వేటు వేసింది. 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
AP: తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో జగన్పై దాడికి కూటమి నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు పేర్కొంది.