మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు.. ధర ఎంతో తెలుసా!?

ఏపీ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుండగా.. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ 2 శాతం సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 

New Update
Liquor Shop Timings

AP News: ఏపీ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుండగా.. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ మేరకు డ్రగ్స్ రీహాబిలిటేషన్ కింద మద్యం ల్యాండెడ్ రేట్లపై 2 శాతం సెస్ విధించనున్నారు. దీని ద్వారా రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఇక డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. 

Also Read: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక

రౌండప్ ఛార్జీల మోత..

ఈ మేరక ఒక మద్యం బాటిల్ ధర రూ.150.50 పైసలు ఉంటే రూ.160 వసూలు చేయనున్నారు. బాటిల్ ధర రూ.200.050 పైసలు ఉంటే రూ.210 వసూలు చేస్తారు. ఇప్పటికే రౌండప్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మద్యం రేట్లు పెరగనుండగా.. ఇప్పుడు డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ అంటే మందుబాబులకు తడిసిపోతుంది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించగా.. భారీగా అప్లై చేసుకున్నారు. 3396 మద్యం దుకాణాలు ఉంటే 89882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము ద్వారానే ఏపీ ప్రభుత్వానికి రూ.1797.64 కోట్లు ఆదాయం వచ్చింది. నూతన మద్యం విధానం ప్రకారం రూ.99 లకే క్వార్టర్ బాటిల్ మద్యం అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. 

Also Read: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. హరీష్ రావు సీరియస్ రియాక్షన్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు