మద్యం దుకాణాలన్నీ మాకే.. చంద్రబాబు సర్కార్ కు ఊహించని షాక్! ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్యం షాపులకు దరఖాస్తులు చేయొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. దీంతో నష్ట నివారణకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనేది ఆసక్తికరంగా మారింది. By Seetha Ram 07 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు కోరుతోంది. దీనిని 2 ఏళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. 2024 అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ నూతన మద్యం పాలసీ విధానం ఉంటుందని తెలిపింది. నూతన మద్యం పాలసీ అమలుకు మూడు విధాలుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైనట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. 12వ తేదీ నాటికి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అక్టోబర్ 11న మద్యం దుకాణాల వేలం పాట జరగనుంది. అయితే లైసెన్స్‌ల కోసం ఒకే వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు సుమారు రూ.2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇందులో లైసెన్స్ దక్కినా, దక్కకపోయినా దరఖాస్తు రుసుము మాత్రం తిరిగి ఇవ్వరు. లైసెన్స్ దక్కించుకున్న వారికి అక్టోబర్ 12 నుంచి నూతన దుకాణాలు నడుపుకోవచ్చు. ప్రభుత్వ ఆదాయానికి గండి రాష్రంలో 961 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని తెలుస్తోంది. దీని కారణం ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు పెట్టవద్దని కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వ్యాపారులకు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదికూడా చదవండి: అమరావతి అదిరిపోయే డ్రోన్ సమ్మిట్.. ఎప్పుడో తెలుసా? మరికొందరైతే తాము ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టమని.. కానీ తమకు వాటా మాత్రం కావాలని అంటున్నారట. దానికి ఒకే అయితేనే దరఖాస్తు పెట్టుకోవాలని చెబుతున్నారట. అలా కాదూ.. కూడదు అనుకుంటే మాత్రం.. తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తూ బెదిరిస్తున్నారని సమాచారం. ఈ జిల్లాలో షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు దీని కారణంగానే ఇప్పటి వరకు కొన్ని షాపులకు ఒక్క అర్జీ కూడా రాలేదని తెలుస్తోంది. వీటిలో తిరుపతి జిల్లాలోని 133 దుకాణాలకు గానూ ఒక్క దరఖాస్తు రాలేదు. అలాగే నెల్లూరులో 84, ప్రకాశంలో 60, విశాఖపట్నంలో 60, కాకినాడలో 58, సత్యసాయి జిల్లాలో 60 దుకాణాలకు గానూ ఒక్కటంటే ఒక్క దరఖాస్తు రాలేదు. ఈ జిల్లాలో దరఖాస్తులు అధికం విజయనగరం జిల్లాలో మొత్తం 153 దుకాణాలు ఉన్నాయి. అందులో 5 మినహా మిగతా వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 855 అప్లికేషన్లు వచ్చాయి. అలాగే ఏలూరు జిల్లాలో 144 షాపులు ఉండగా.. 706 అర్జీలు వచ్చాయి. అందులో 16 షాపులకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలు ఉండగా.. 613 అర్జీలు అందాయి. అంచనా లక్ష.. వచ్చింది 8,274 మాత్రమే.. రాష్ట్రంలో 3,396 మద్యం షాపులకు ప్రభుత్వం లైసెన్సుల జారీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో ఒక్కో షాపుకి సగటున 30 చొప్పున సుమారు 1లక్షకు పైగా అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం భావించింది. అదే సమయంలో నాన్ రిఫండబుల్ ఫీజుల రూపంలో దాదాపు రూ.2000 కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. ఇది కూడా చదవండి: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి? ఇప్పటి వరకు కేవలం 8,274 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.165.48 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇంకా అర్జీల స్వీకరణకు మూడు రోజులే ఉంది. అందులోనూ ఎక్సైజ్ అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికే దాదాపు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చేయాలి. కానీ కొందరు ఎమ్మెల్యేలు, కీలక నేతల వల్ల ఆదాయానికి గండి పడినట్లు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వానికి తలనొప్పి? అధికార పార్టీ శాసనసభ్యులు, నాయకుల తీరుతో ప్రభుత్వానికి మద్యం దుకాణాల విషయంతో తలనొప్పి మొదలైంది. గత ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఇప్పటి వరకు ఆరోపిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ తాము అధికారంలోకి వస్తే కొత్త మద్యం పాలసీని తీసుకువస్తామని, తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట మేరకు కొత్త మద్యం పాలసీని చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ.. అధికార పక్ష నేతల మితి మీరిన జోక్యం కారణంగా దరఖాస్తు ప్రక్రియ వివాదాస్పదం కావడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా వార్తలు రావడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఒకట్రెండు రోజుల్లోనే ఈ అంశంపై రివ్యూ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. #wine-shops #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి