AP Crime: ఏపీలో ఘోరం.. తల్లి, తమ్ముడిని కడతేడ్చిన కసాయి!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం సుంకర పద్దయ్య వీధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో అన్నయ్య కత్తితో పొడిచి తల్లిని అతి కిరాతకంగా హతమార్చాడు. మృతులు మహాలక్ష్మి, తమ్ముడి రవితేజగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
West Godavari Crime News

West Godavari Crime News

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం సుంకర పద్దయ్య వీధిలో ఈరోజు తెల్లవారుజామున అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో అన్నయ్య కత్తితో పొడిచి తల్లిని (మహాలక్ష్మి - 66), తమ్ముడిని (రవితేజ - 33) అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ డబుల్ మర్డర్‌కు పాల్పడిన నిందితుడిని గునుపూడి శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో తల్లి, తమ్ముడితో ఘర్షణ పడిన శ్రీనివాస్ ఆవేశంలో చాకుతో వారిద్దరినీ విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు తెలుస్తోంది.

అతి కిరాతకంగా చంపి..

హత్య అనంతరం నిందితుడే స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఈ దారుణాన్ని గురించి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన తీవ్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిని పరిశీలించిన పోలీసులు అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలకు గల కారణాలు ఇంకా పూర్తిస్థాయిలో తెలియరాలేదు. 

ఇది కూడా చదవండి: పెళ్లి కాస్త విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

ఆస్తి తగాదాలు లేదా కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మి ఘటన వివరాలను తెలుసుకుని.. కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు శ్రీనివాస్‌ను తమదైన శైలిలో విచారిస్తున్నారు. కుటుంబంలో చోటుచేసుకున్న ఈ దారుణంపై సుంకర పద్దయ్య వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే ఇంట్లో రెండు హత్యలు జరగడం భీమవరంలో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియో: 150 అడుగుల లోయలో పడిపోయిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది..!

Advertisment
తాజా కథనాలు