Parliament Sessions: రాహుల్ గాంధీకి సారీ చెప్పిన అనురాగ్ ఠాకూర్.. ఎందుకంటే
తమ కులం ఏంటో తెలియని వాళ్లు కులగణన చేయాలంటున్నారని లోక్సభ సమావేశాల్లో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయన రాహుల్కు క్షమాపణలు చెప్పారు.