పార్లమెంట్లు తరచుగా దేశ నాయకులను తయారు చేస్తుంటాయి. చాలా మంది భారత ప్రధానులు తమ రాజకీయ వ్యూహాలతో గెలిచారు. కానీ పార్లమెంటులో వారి మాటల చాతుర్యంతో కాదు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. ప్రధాని కాకముందు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన్ని అనుసరించిన మిగతా ప్రధానులు పార్లమెంటులో కూడా పెద్దగా ప్రసంగాలు చేసిన వారు కాదు. లాల్ బహదూర్ శాస్త్రీ, ఇందిరాగాంధీ, రాజీవగాంధీ, మోరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, పీవీ నరసింహ రావు, మన్మోహన్ సింగ్ కూడా గొప్ప వాక్చాతుర్యం ఉన్నవారేం కాదు.
పూర్తిగా చదవండి..నరేంద్ర మోదీ.. గుజరాత్ సీఎం అయ్యాక ప్రధాని అయ్యారు. ఇప్పుడు ఆయన ఒక గొప్ప నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మోదీ వాక్చాతుర్యం ఆయనకు పాపులారిటీ తీసుకురాలేదు. 2024 ఎన్నికల తర్వాత మొదటిసారి జరిగిన పార్లమెంటు సమావేశాల్లో.. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కుమారుడు, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అనురాగ్ ఠాకూర్ (49) ఒక పెద్ద ప్రసంగం చేశారు. అది వైరల్ అయ్యింది. ఆయనను మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ ఈ సమావేశాల్లో అందరికన్నా ఎక్కువగా అనురాగ్ ఠాకూర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విపక్ష నేత రాహుల్ గాంధీ కన్నా కూడా అనురాగ్ ఠాకూర్ వైరల్ అయ్యారు. ఆయన ప్రసంగం గురించే ఎక్కువగా చర్చలు జరిగాయి. గత కొన్నేళ్లలో ఈ ప్రసంగం ఎంతో విశేషమైనది.
Also Read: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. ప్రధాని మోదీ పోస్ట్ వైరల్!
బ్రిటన్ పార్లమెంట్ తర్వాత భారత పార్లమెంటు ఏర్పడింది. బ్రిటన్ పార్లమెంటులో ఎంపీలు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం వల్లే రాజకీయాల్లో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లారు. బెంజామిన్ డిస్రాయెల్, విల్లియమ్ గ్లాడ్‌స్టోన్, వినస్టన్ చర్చిల్ గొప్ప వాక్చాతుర్యం ఉన్నవారు. వీళ్లందరూ కూడా దేశ ప్రధానులు అయ్యారు. ఇండియన్ పార్లమెంటులో రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెజ్, ఇంద్రజిత్ గుప్తా, క్రిపాలని వంటి విపక్ష నేతలు పార్లమెంటు వక్తలుగా పేరు సంపాదించుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ కూడా గొప్ప వాక్చాతుర్య లక్షణమున్న వారే. గత మోదీ ప్రభుత్వంలో అనురాగ్ ఠాకూర్ మంత్రిగా పనిచేశారు. కానీ హిమాచల్‌ప్రదేశ్ నుంచి గెలిచిన జేపీ నడ్డా ఈసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో అలాంటి చిన్న రాష్ట్రానికి మరికొన్ని మంత్రి పదవులు దక్కేందుకు చోటు లేదు. అనురాగ్ ఠాకూర్ 2015 నుంచి 2017 వరకు బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవే ఆయనకు దేశంలో గుర్తింపు వచ్చేలా చేసింది. అంతేకాదు ఆయన మూడుసార్లు బీజేపీ యువ మోర్చాకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయన ఒక హార్ట్ కోర్ పొలిటీషియన్. ఆగస్టు 1న పార్లమెంటులో అనురాగ్ ఠూకూర్ తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విపక్ష నేత రాహుల్ గాంధీ దాదాపు 3 గంటల వరకు మాట్లాడారు. రాహుల్ తన ప్రసంగంలో బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించారు. చివరికి స్పీకర్ ఓం బిర్లాను కూడా వ్యక్తిగతంగా విమర్శించారు. రాహుల్ గాంధీ కరెక్టుగా మాట్లాడి ఉండొచ్చు లేదా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. తాను చెప్పాలనుకుది చెప్పేశారు. దీంతో రాహుల్‌కు ఎవరు సమాధానం చెప్పాలనే ఆందోళన బీజేపీలో మొదలైంది. కానీ అనురాగ్ ఠాకూర్ రాహుల్ దీనికి గట్టిగా బదులిస్తారని ఎవరూ ఊహించలేదు. ఈయన గతంలో విపక్ష ఎంపీగా కూడా మాట్లాడారు. కానీ అప్పట్లో ఈయన స్పీచ్‌లు అంతగా వార్తల్లో వచ్చేవి కావు. సాధారణంగా అధికార ప్రభుత్వం తరఫున మాట్లాడే వక్తలు.. గణంకాలు, విధానాలను వివరిస్తారు. బోరింగ్‌గా ఉండే ప్రసంగాల చేస్తారు. కానీ ఆగస్టు 1న అనురాగ్ ఠాకూర్.. రాహుల్ గాంధీపై దృష్టి పెట్టి గట్టి కౌంటర్ అటాక్ ఇచ్చారు.
పార్లమెంటు ప్రసంగాలు వ్యంగ్యంగా, చమత్కారంగా ఉన్నప్పుడే ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలాంటి ప్రసంగమే అనురాగ్ ఠాకూర్ చేశారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అందులో అతిముఖ్యమైనది కుల గణన డిమాండ్‌పై ఒక్క సెంటెన్స్లోనే సమాధానం చెప్పడం. ‘వారి కులం ఎంటో చెప్పనివారే కుల గణన చేయని డిమాండ్ చేస్తున్నారు’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇక్కడ ఎవరి పేర్లు ప్రస్తావిచలేదు, తిట్టలేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన సోషల్ మీడియా అకౌంట్లో అనురాగ్ ఠాగూర్ స్పీచ్‌ను పోస్ట్ చేశారు.
Also Read: బంగ్లాదేశ్‌లో అదుపుతప్పిన శాంతిభద్రతలు.. భారత్‌కు చేరుకున్నషేక్ హసీనా
అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలకు విపక్ష నేతలు కౌంటర్ చేయలేకపోయారు. పార్లమెంటులో డిబేట్లు, గంటలపాటు సాగే ప్రసంగాలను అందరూ మర్చిపోతారు. కానీ ఇలాంటి విభిన్నమైన, హాస్యభరితమైన వ్యాఖ్యలు ఎప్పటికే గుర్తిండిపోతాయి. అనురాగ్ ప్రసంగం తన పార్టీని ఉత్తేజపరిచేలా చేసింది. అలాగే ఆయన్ని అగ్రగ్రామి నాయకుడిగా కూడా నిలబెట్టింది. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో రిటైర్ కావాల్సి ఉంది. దీంతో తర్వాతి అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్‌నే చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఇప్పుడు అనురాగ్ అవసరం.
ఇప్పడు ఈయన పేరే పొలిటికల్ గా మార్మోగిపోతోంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక్క ప్రసంగానికే ఎవరికీ కూడా అంతగా గుర్తింపు రాదు. కానీ కొన్నిసార్లు ఒక్క ప్రసంగం కూడా పాపులారిటీని తీసుకొస్తుంది. ఆగస్టు 1న లోక్‌సభలో ఇచ్చిన స్పీచ్ అనురాగ్ ఠాకూర్‌కు గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో.. కానీ, భారత పార్లమెంటు అనురాగ్ ఠాకూర్‌కు ఒక మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చే అవకాశం కల్పించింది. అనురాగ్ ఠాకూర్ మరింత ఉన్నత స్థానంలోకి వెళ్లేందుకు అవకాశం వస్తుందో రాదో వేచిచూడాలి.
పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు
[vuukle]