E-Cigarette In Parliament: లోక్ సభలో ఈ సిగరెట్ రచ్చ..ఫిర్యాదు చేసిన బీజేపీ

శీతాకాల సమావేశాల్లో ఈరోజు లోక్ సభలో ఈ సిగరెట్ పై రచ్చ అయింది. దేశంలో నిషేధించబడిన ఈ-సిగరెట్‌ను టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎంపీ సభ లోపల ధూమపానం చేసినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.

New Update
anurag

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగుతున్న వేళ.. లోక్‌సభలో సడెన్ గా ఓ కొత్త వివాదం తలెత్తింది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ సభా పరిసరాల్లోనే ఈ సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ టాగూర్ ఆరోపించారు. అంతే కాదు ఆయన స్పీకర్ ఓం బిర్లాకు కంప్లైంట్ కూడా చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో అనురాగ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. 

సిగరెట్ తాగింది ఆమెనా?

దేశంలో ఈ సిగరెట్ లు నిషేధించారు. 2019 నాటి ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం.. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఎగుమతి, ప్రకటనలు చేయడం చట్టవిరుద్ధం.కానీ టీఎంసీకి సంబంధించి ఎంపీకి ఇదేమీ పట్టలేదు. ఆయన సభ లోపలే సిగరెట్ తాగుతూ కనిపించారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్ సభలో దానికి అనుమతి ఉందా అని ఆయన ప్రశ్నించారు.  దీనికి స్పీకర్ ఓం బిర్లా బదులిస్తూ.. సభ లోపల ఎవరూ ధూమపానం చేయడానికి ఎలాంటి నిబంధన లేదా సంప్రదాయం లేదని స్పష్టం చేశారు. దీనిపై తాను కచ్చితంగా చర్యలు తీసుకుంటానని..సభ్యులంతా హుందాగా వ్యవహరించాలని చెప్పారు. దీంతో బీజేపీ సభ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇది సభలో గందరగోళాన్ని నెలకొల్పింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల ప్రకారం.. టీఎంసీ ఎంపీ మహువా మైత్రి ఈ-సిగరెట్ తాగినట్లు తెలుస్తోంది. 

అంతకు ముందు రోజు లోక్ సభలో ఓట్ చోరీపై సభలో రచ్చ అయింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, హోం మంత్రి అమిత్ షాల మధ్య వాగ్వాదం అయింది.  ఓటరు జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సమీక్ష (SIR), 'ఓట్ చోరీ' ఆరోపణలపై చర్చ జరిగింది. బీహార్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేకనే ఓడిపోయిందని, ఓట్ చోరీ వల్ల కాదని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేయగా.. తాను మూడు విలేకరుల సమావేశాల్లో చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలపై అమిత్ షాతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు