Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్ మేళా
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, చేనేత సామాజిక వర్గం నేత మచాని సోమనాథ్ మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ బరిలోకి దింపడంతో టీడీపీ వ్యూహం మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అధిష్ఠానం తనను మోసం చేసిందని వాపోతున్నారు ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక సేవలు చేశానన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరించారు.
మాజీ మంత్రి నారాయణ తానే గెలిచినట్లు కలలు కంటున్నారని కామెంట్స్ చేశారు వైసీపీ మైనార్టీ నేత సమీర్ ఖాన్. నెల్లూరులో అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుపొందడం ఖాయమన్నారు. టీడీపీ మైనార్టీలకు ద్రోహం చేస్తుంటే వైసీపీ న్యాయం చేస్తుందన్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆకి పోగు ప్రభాకర్ ఆత్మహత్యయత్నం చేశాడు. బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. తన భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కడప టీడీపీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు టీడీపీ పట్టుభద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా టీడీపీకి 98, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. 25 ఇస్తే పావలా అంటారు.. 23ఇస్తే లక్కీ నంబర్ అంటారని జనసేనకు 24 ఇచ్చినా కూడా వైసీపీ మాత్రం ఇంకా 23 నంబర్‌నే హైలేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తోంది.
లారీ మరమ్మతులకు గురి కావడంతో రోడ్డు పక్కన నిలిపి బాగు చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తుల మీదకు విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకువచ్చింది. అంతేకాకుండా అదే సమయంలో అటు గా వెళ్తున్న మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
అనంతపురం జిల్లా తలారిచెరువు గ్రామస్థులు దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి ఓ వింత ఆచారాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు. ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. అసలు ఆ గ్రామస్థులు ఎందుకు అలా చేస్తారో ఆర్టికల్ లో తెలుసుకుందాం..