Andhra Pradesh: మరికాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం
మరి కాసేపట్లో అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయనతో బాబు మంత్రివర్గ కూర్పు మీద చర్చ చేయనున్నారు.
మరి కాసేపట్లో అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయనతో బాబు మంత్రివర్గ కూర్పు మీద చర్చ చేయనున్నారు.
పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు.
విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్‌తోపాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు.
సామాజిక భద్రత పింఛన్ల పెంపు పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపింది.పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.
ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన బాలయ్య బాబు ఈసారి తన పుట్టిన రోజు వేడుకలను హిందుపురంలోనే జరుపుకున్నారు. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు.
ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత నిరుపేద సీఎంగా దామోదరం సంజీవయ్య చరిత్రలో నిలిచిపోయారు. ప్రజాప్రతినిధిగా వచ్చిన జీతం తప్ప మరో ఆదాయం లేదు. ఆయన మరణించే వరకు బట్టలు, ఒక ప్లేటు, గ్లాసు మాత్రమే.. ఆసక్తికరమైన స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
'ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్' అంటూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఏపీలో ఇకపై కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఉండదని, భారీగా ఈ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.