Andhra Pradesh : ఏపీలో తిరిగి ప్రారంభం అయిన అన్న క్యాంటీన్లు.. ఎక్కడ,ఎవరు ప్రారంభించారంటే! ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన బాలయ్య బాబు ఈసారి తన పుట్టిన రోజు వేడుకలను హిందుపురంలోనే జరుపుకున్నారు. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు. By Bhavana 11 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Anna Canteens Re-Opened : నందమూరి నట సింహం బాలయ్య బాబు (Balakrishna) సోమవారం తన 64 వ పుట్టిన రోజు వేడుకలను (Birthday Celebrations) ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) బాలయ్య బాబు హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాలయ్య బాబు ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఈసారి హిందుపురం (Hindupuram) లోనే బాలయ్య బాబు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. హిందూపురంలో బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు. 2014వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ఎన్నికలకు కొద్ది నెలలు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు (Anna Canteens) ఏర్పాటు చేశారు. అయితే పలు కారణాలతో 2019 ఎన్నికల్లో గెలిచిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని మూసివేయించింది. అయితే తాము తిరిగి అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించిన కూటమి ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో మొదటి అన్న క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించినట్లయింది. Also read: మోదీ కేబినెట్ లో అతి చిన్న వయస్సున్న ఎంపీ తెలుగువాడే! #hindupuram #balakrishna #andhra-pradesh #anna-canteens #birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి