/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
TDLP Meeting : విజయవాడ (Vijayawada) లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ (Private Function Hall) లో మంగళవారం ఉదయం 10 గంటలకు టీడీఎల్పీ (TDLP) సమావేశాన్ని నిర్వహించనున్నారు. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు (Chandrababu) ను పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తోపాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. సమావేశం తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలంతా ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు గవర్నర్ ని కోరనున్నారు.