/rtv/media/media_files/2025/03/01/nEm4wj34P3zH4FmKALtM.jpg)
Youtuber prank Gold Hunt
Gold Hunt: రీల్స్, యూట్యూబ్ షాట్లతో పిచ్చి ముదిరిన యూ ట్యూబర్లు ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రవర్తిస్తున్నారు. లైక్‌ల కోసం వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ యూట్యూబర్ చేసిన పనితో ఓ స్టేడియం పాడవ్వడమేకాకుండా ప్రజలు అబాసుపాలయ్యారు.
Also read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
యూట్యూబ్ చానెల్ ఫ్యూస్ కోసం యూ ట్యూబర్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.పిచ్చిపిచ్చి చేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వ్యూస్ కోసం పలు చిత్ర, విచిత్ర పోటీలు పెడుతూ ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. యూట్యూబర్ల మాయలో పడిన ప్రజలు వారి ఏం చెబితే అదే చేస్తున్నారు. వారు చెప్పింది నిజమని నమ్మి నష్టపోతున్నారు. కొంతమంది యూట్యూబర్లు ఉచితంగా డబ్బులు ఇస్తామని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అది నిజమని నమ్మితే వారినుంచి జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. కాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ యూట్యూబర్ గోల్డ్ హంట్ పేరిట నిర్వహించిన పోటీ కేసుల వరకు వెళ్లింది.
Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన యూట్యూబర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించాడు. దానికోసం ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది బాగా వైరల్ అయింది. అమలాపురంలోని బాలయోగి స్టేడియం భూమిలో వెండి, బంగారం, ఇయర్ పాడ్స్ దాచి పెట్టానని అవి ఎవరికి దొరికితే వారికేనని వీడియో పెట్టాడు. అవి దొరికిన వాళ్లు తీసుకోండి అంటూ మందపాటి ఆదిత్య అనే యూట్యూబర్ ప్రాంక్ చేశాడు. ఫస్ట్ ప్రైజ్ కింద గోల్డ్, రెండో ప్రైస్ కింద వెండి ఉంగరం, మూడో ప్రైజ్ కింద ఇయర్ బర్డ్స్ ఇస్తానని నమ్మించాడు. ఆదిత్యను ఇన్స్‌స్టాలో ఫాలో అయిన వారికి గోల్డ్ హంట్ వీడియోను రీల్‌గా పెట్టాడు.
Also Read: నన్ను రేప్ చేశారు’.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌తో - సీన్ రివర్స్ కావడంతో మహిళ అరెస్ట్!
ఈ వీడియో చూసిన జనమంతా అది నిజమేనని నమ్మి స్టేడియానికి పరుగులు తీశారు. వెళ్లిన వారు ఊరికే ఉంటారా? బంగారం కోసమని సుమారు 100 యువకులు స్టేడియాన్ని తవ్వి బంగారం కోసం వెతకడం ప్రారంభించారు. ఒక్కసారిగా యువకులు వచ్చి స్టేడియాన్ని తవ్వడంతో అలర్ట్ అయిన ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. అయితే వారితో యువకులు వాగ్వివాదానికి దిగారు. ఉద్యోగులు ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు తెలవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్డేడియానికి చేరుకుని స్టేడియాన్ని తవ్వుతున్న వారిని అడ్డుకున్నారు. స్టేడియాన్ని తవ్వడానికి కారణాలు విని విస్తుపోయారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోటీపెట్టిన యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాధికారి కోరారు.
Also Read : మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?